నేను జగనన్న సైనికురాలిని.. టిక్కెట్ ఇవ్వకున్నా జగన్ వెంటే.. మంత్రి రోజా

నేను జగనన్న సైనికురాలిని.. టిక్కెట్ ఇవ్వకున్నా జగన్ వెంటే.. మంత్రి రోజా

చిత్తూరు జిల్లా నగిరిలో ఎవరికి సీటు ఇచ్చినా జగనన్న సైనికురాలుగా పని చేస్తానని ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రకటించారు. మంగళవారం ( డిసెంబర్​19) వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రోజాకి సీటు లేదని ప్రచారం చేసినంత మాత్రాన ఎవరూ భయపడరని రోజా అన్నారు.

నేను జగన్ సైనికురాలిని..( Minister Roja )

నగిరిలో రోజాకు సీటు ఇవ్వకపోతే అక్కడ వైసీపీతరపున ఎవరు నిలబడతారని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ మాదిరిగా రెండు ప్రాంతాల్లో నిలబడి సర్వేలు చేయించుకునే దాన్ని కాదని రోజా అన్నారు. గడపగడపకి తిరుగుతూ సేవ చేస్తున్న వారికి, పార్టీకి పనిచేసిన వారికి కచ్చితంగా జగనన్న సీటు కేటాయిస్తారని రోజా చెప్పారు.ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందంజలో ఉండే ఎమ్మెల్యేల్లో నేనూ ఒకరిని. నేను వైఎస్‌ జగన్‌కు సైనికురాలిని. ఆయన కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వైఎస్ జగన్ నాకు టిక్కెట్ నిరాకరించినా ఆయన వెంటే ఉంటాను, ముఖ్యమంత్రి నిర్దేశించిన వై నాట్ 175 లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగస్వామ్యమవుతాను అని రోజా అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, అయితే ముఖ్యమంత్రి సూచనలకు కట్టుబడి ఉంటానని రోజా చెప్పారు. వైఎస్ జగన్‌ను మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశానని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్థులు లేరని రోజా మండిపడ్డారు