
మల్కాజిగిరి, వెలుగు: అమ్మానాన్న క్షమించండి.. నా చావుకు నేనే కారణం అంటూ ఓ బాలుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుషాయిగూడ లక్ష్మీనగర్ హెచ్ బీ కాలనీలో నివాసముంటున్న నాగేందర్ కొడుకు భవాని ప్రసాద్ ఓ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. గురువారం రాత్రి భోజనం చేసి తల్లి పక్కనే పడుకున్నాడు. శుక్రవారం ఉదయం లేచేసరికి పక్కన కనిపించలేదు. బయటికి వెళ్లి చూడగా వరండాలో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుని కనిపించాడు. మృతికి గల కారణాలు తెలియరాలేదు.