నేను రష్మిక అంత ఫేమస్ కాదు..డీప్ఫేక్ రాజకీయ నాయకులకూ ప్రమాదకరమే : కేటీఆర్

నేను రష్మిక అంత ఫేమస్ కాదు..డీప్ఫేక్ రాజకీయ నాయకులకూ ప్రమాదకరమే : కేటీఆర్

హైదరాబాద్‌ బేగంపేటలోని గ్రాండ్ కాకతీయ హోటల్లో మహిళలతో నిర్వహించిన #WomenAskKTR కార్యక్రమంలో మంత్రి KTR పాల్గొన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయిన హీరోయిన్ రష్మిక (Rashmika) మందన్న డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించి  పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు స్పందించారు. వారంతా రష్మికకు మద్దతుగా నిలిచారు. 

ఇదివరకే మంత్రి కేటీఆర్‌ కూడా ఆ వీడియోపై స్పందించిన విషయం తెలిసిందే. సినిమా హీరోయిన్స్ ను కించపరిచే దారుణమైన వీడియో అని..ఇది తీవ్ర అవమానకరమైన మరియు రెచ్చగొట్టే విషయమని అన్నారు. తెలంగాణ మంత్రిగా కొత్త నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, దీనిపై సైబర్ క్రైమ్‌కు కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన పరిష్కారాన్ని తొందరగా కనుగొంటుందని ఆశిస్తున్నా అని తెలిపారు. 

ఇక లేటెస్ట్ గా..డీప్‌ఫేక్ వీడియోపై మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. డీప్‌ఫేక్‌ టెక్నాలజీ వల్ల మహిళలకు మాత్రమే కాకుండా పొలిటిషయన్స్ కు కూడా ప్రమాదమేనని కేటీఆర్ వెల్లడించారు.రాజకీయ ప్రత్యర్థులు డీప్‌ఫేక్ వాడి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాను రష్మిక అంత ఫేమస్ కాదని..ఇప్పటి వరకు తనపై ఎలాంటి డీప్‌ఫేక్ వీడియో రాలేదని ఈ సందర్భంగా ఆయన ఫన్నీ కామెంట్ చేశారు. 

ఈ డీప్ఫేక్ వీడియోపై దాదాపు టాప్ సెలబ్రెటీస్ అందరు స్పందించారు. ఇలాంటి వారిని ఉపేక్షించకూడదని, ఆ వీడియో చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతే వేగంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి.. ఆ వీడియో చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.