నేను ‘గే’ కాదు : క్రికెటర్ వెరైటీ కామెంట్

నేను ‘గే’ కాదు : క్రికెటర్ వెరైటీ కామెంట్

సిడ్నీ: తాను స్వలింగ సంపర్కుడని(గే) సోమవారం రాత్రి ఇన్‌ స్టగ్రమ్‌ లో పోస్ట్ పెట్టిన ఆస్ట్రేలియా క్రికెటర్‌ జేమ్స్‌ ఫాల్క్‌నర్‌ కొద్ది గంటల్లోనే గే కాదంటూ మరో పోస్ట్ పెట్టాడు. ఆదివారం 29వ పుట్టినరోజు జరుపుకొన్న సందర్భంగా ఫాల్క్‌ నర్‌ తన బాయ్‌ ఫ్రెండ్, తల్లితో కలిసి ఉన్న ఓ ఫొటోను ఇన్‌ స్టాగ్రమ్‌ లో పోస్ట్ చేశాడు. బాయ్‌ ఫ్రెండ్‌ తో బర్త్‌డే డిన్నర్‌ అంటూ రాబర్ట్‌ తో కలిసున్న ఫొటోను ఇన్‌ స్టాగ్రామ్‌ పోస్ట్‌లో వెల్లడించడంతో ప్రతి ఒక్కరూ తనను అపార్థం చేసుకున్నారని ఫాల్క్‌ నర్ వివరణ ఇచ్చాడు. రాబర్ట్ తనకు స్నేహితుడు మాత్రమే అని చెప్పాడు. తాను గే అనుకుని ఎన్నో ట్రాన్స్‌ జెండర్ సంఘాలు తనకు మద్దతు పలకడంపై ఫాల్క్‌ నర్ ఆనందం వ్యక్తం చేశాడు. బౌలింగ్‌ ఆల్‌ రౌండరైన ఫాల్క్‌ నర్‌ ఆసీస్‌ కు ఓ టెస్టు, 69 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించాడు. అతను 2017 అక్టోబరులో చివరి మ్యాచ్‌ ఆడాడు.