స్టేషన్ ఘనపూర్‌లో దళిత బంధు అందించే బాధ్యత నాదే

స్టేషన్ ఘనపూర్‌లో  దళిత బంధు అందించే బాధ్యత నాదే

దళిత మేధావులు మౌనంగా ఉంటే దళిత జాతి అభివృద్ధి చెందదని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. దళితుల ఉన్నతికోసం ఏ పార్టీ పాటుపడలేదని, యుగపురుషుడు కేసీఆర్ వల్లనే దళితులు అభివృద్ధి చెందుతున్నరని చెప్పుకొచ్చారు. 99.18 శాతం దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేశామన్న రాజయ్య.. లక్షా డెబ్బై వేల కోట్లు దళిత బంధుకు ఖర్చు చేయనున్నామని స్పష్టం చేశారు. దళిత బంధు నిధి 4వేల కోట్లు మిగిలి ఉన్నాయని, ఓ వైపు దళితుల తలరాతలు మారుతుంటే.. బీజేపీ అర్ధంలేని ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. 

దళితుల పైన ఉన్న ప్రేమతో  దళిత బంధు తీసుకొచ్చారన్న ఎమ్మెల్యే... ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా కేసీఆర్  దళిత బంధు తీసుకొచ్చారని తాటికొండ రాజయ్య  చెప్పారు. స్టేషన్ ఘనపూర్ లో 25 వేల కుటుంబాలను దళిత బంధు అందించే బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు. దళిత బంధు కేవలం మాదిగలే అనే అభిప్రాయంతో ఉన్నారన్న ఆయన... దళితుల్లో 59 కుటుంబాలు ఉన్నాయని, వీరికి కూడా ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు లక్షల కుటుంబాలకు దళిత  బంధు ఇచ్చారని, మిగిలిన వాళ్ళకు కూడా ఇస్తారని తెలిపారు.