I & PR స్కామ్ లో వెలుగు చూస్తున్న బాగోతాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అక్రెడిటేషన్ కార్డులను అర్హులైన వారికి ఇవ్వకుండా.. ఎంత అందితే అంత అన్నట్లుగా డబ్బులకు అమ్ముకుంటున్నారు. వివిధ సంస్థలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు.. కార్డు అప్లై చేసినా రాని వారిని సంప్రదించి భారీగా దోచుకుంటున్నారు.
ముఖ్యంగా ఫేక్ సీఏ సర్టిఫికెట్లతో అక్రమంగా అక్రెడిటేషన్ కార్డులు పొందిన కొన్ని ఆన్ లైన్ పత్రికల నిర్వాహకులు.. కార్డులను పెద్ద మొత్తంలో అమ్ముకుంటున్నారు. వీరు పంపిన లిస్టుల్లో ఉన్న వ్యక్తుల గురించి ఆఫీసర్లు ఎంక్వైరీ చేయకుండానే కార్డులు జారీ చేశారు.
ఇలాంటి పేపర్ల నిర్వాహకులు జిల్లాల్లో ఒక్కో అక్రెడిటేషన్ కార్డుకు ఒక్కో రేట్ ఫిక్స్ చేశారు. స్టేట్ అక్రెడిటేషన్కార్డుకు రూ.50 వేలు, జిల్లా కార్డుకు రూ.30 వేల చొప్పున అమ్ముకుంటున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఫేక్ సీఏ లెటర్స్పై ఎంక్వైరీకి ఆదేశించి, అనర్హులకు ఇచ్చిన కార్డులను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
