Rahul Gandhi : బీజేపీ నా గురువు : రాహుల్ గాంధీ

Rahul Gandhi : బీజేపీ నా గురువు : రాహుల్ గాంధీ

బీజేపీని తన గురువుగా భావిస్తున్నానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ‘ఎలాంటి పనులు అస్సలు చేయకూడదు’ అనే విషయాన్ని బీజేపీని చూసి నేర్చుకున్నట్లు చెప్పారు.  తన భవిష్యత్ కు ఒక రోడ్ మ్యాప్ ను కూడా బీజేపీయే చూపిస్తోందని రాహుల్ సటైర్ వేశారు. ‘‘బీజేపీ వాళ్లు కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా దాడి చేయాలని నేను కోరుకుంటున్నా.  దాని వల్ల కాంగ్రెస్ పార్టీ తమ సైద్ధాంతికతను, భావజాలాన్ని గ్రహించేందుకు ఆస్కారం కలుగుతుంది’’ అని రాహుల్ అన్నారు. 

‘‘ భారత్ జోడో యాత్రను ప్రారంభించినప్పుడు.. అది కేవలం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు  సాగే సాధారణ యాత్రలా కనిపించింది. క్రమక్రమంగా ప్రజలతో మమేకం అవుతూ ఈ యాత్రకు భావం, భావోద్వేగాలు సైతం ఉన్నాయని గ్రహించాను. భారత్ జోడో యాత్ర తలుపులు అందరి కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎవరైనా ఈ యాత్రలో మమేకం కావచ్చు. అఖిలేశ్ జీ, మాయావతీ జీ సహా ‘మొహబ్బత్ కా హిందుస్తాన్’ కోరుకునే ప్రతి ఒక్కరు యాత్రలో భాగస్వాములు కావచ్చని’  రాహుల్ అన్నారు.