వరల్డ్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌, బ్లిట్జ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో పెద్దగా అంచనాలు పెట్టుకోను: గుకేశ్‌‌‌‌

వరల్డ్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌, బ్లిట్జ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో పెద్దగా అంచనాలు పెట్టుకోను: గుకేశ్‌‌‌‌

దోహా: వరల్డ్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌, బ్లిట్జ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో తనపై పెద్దగా అంచనాలు పెట్టుకోవద్దని వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ డి. గుకేశ్‌‌‌‌ అన్నాడు. క్లాసికల్‌‌‌‌ చెస్‌‌‌‌ తాను అద్భుతంగా ఆడతానని వెల్లడించాడు. ‘నేను ఏ ఫార్మాట్‌‌‌‌లోనైనా బాగా ఆడాలని అనుకుంటా. కానీ ఈ ఏడాది ర్యాపిడ్‌‌‌‌, బ్లిట్జ్‌‌‌‌ను కొంచెం సీరియస్‌‌‌‌గా తీసుకున్నా. అయితే ఈ రెండింటి కంటే నాకు క్లాసికల్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌తో టచ్‌‌‌‌ ఎక్కువగా ఉంది. వాటికే చాలా ప్రాధాన్యత ఇచ్చా. కాబట్టి ఈ టోర్నీపై పెద్దగా అంచనాల్లేకుండానే బరిలోకి దిగుతున్నా. నేను ఇక్కడికి ఆడటానికి వచ్చా. 

సరదాగా గడపాలనే లక్ష్యంతో, ప్రయోగాలు చేయాలనే ఉద్దేశంతో పాటు చెస్‌‌‌‌ను ఆస్వాదించడానికి వచ్చా’ అని గుకేశ్‌‌‌‌ పేర్కొన్నాడు. గేమ్‌‌‌‌లో వేగంగా ఆడటం, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే తన లక్ష్యమన్నాడు. గ్లోబల్‌‌‌‌ చెస్‌‌‌‌ లీగ్‌‌‌‌ వల్ల తనకు మంచి ప్రాక్టీస్‌‌‌‌ లభించిందన్నాడు. కొంతమంది బలమైన ప్రత్యర్థులపై వేగవంతమైన ఆట ఆడానని గుర్తు చేశాడు. తన వ్యూహ్యాన్ని వేగంగా అమలు చేయడమే తన ముందున్న కర్తవ్యమని తెలిపాడు.