టీ20ల్లో ఇండియా ఫేవరెట్‌‌‌‌ కాదు: వాన్‌‌‌‌

టీ20ల్లో ఇండియా ఫేవరెట్‌‌‌‌ కాదు: వాన్‌‌‌‌

న్యూఢిల్లీ : యూఏఈలో జరుగుతున్న టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో టీమిండియా ఫేవరెట్‌‌‌‌ కాదని, అసలు కోహ్లీసేనకు ఆ ట్యాగ్‌‌‌‌ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని ఇంగ్లండ్‌‌‌‌ మాజీ కెప్టెన్‌‌‌‌ మైకేల్‌‌‌‌ వాన్‌‌‌‌ అన్నాడు. ‘నా దృష్టిలో టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో ఇంగ్లండే ఫేవరెట్‌‌‌‌. అసలు టీ20ల్లో ఇండియాకు ఫేవరెట్‌‌‌‌ ట్యాగ్‌‌‌‌ ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఇటీవల వాళ్లు ఆడిన టోర్నీల్లో  పెర్ఫామెన్స్‌‌‌‌ చూశాక.. ఆ హోదాకు చాలా దూరంలో ఉన్నారని నా అభిప్రాయం.  వెస్టిండీస్‌‌‌‌, పాకిస్తాన్‌‌‌‌ ఈ టోర్నీలో ప్రమాదకర జట్లు.  పాక్‌‌‌‌తోపాటు న్యూజిలాండ్‌‌‌‌లో కూడా టాప్‌‌‌‌ ప్లేయర్లు ఉన్నారు. పైగా, మ్యాచ్‌‌‌‌లు గెలవడానికి ఓ స్ట్రాటజీతో బరిలోకి దిగుతారు. ఇక, ఆస్ట్రేలియాకు అసలు చాన్స్‌‌‌‌ లేదు. ఇంగ్లండ్‌‌‌‌, వెస్టిండీస్‌‌‌‌, న్యూజిలాండ్‌‌‌‌, పాకిస్తాన్‌‌‌‌లో ఒక జట్టు విజేతగా నిలుస్తుంది’ అని మైకేల్‌‌‌‌ వాన్‌‌‌‌ అభిప్రాయపడ్డాడు.