ఉలాన్‌బాటర్ (మంగోలియా): ఇండియా బాక్సర్ విశ్వనాథ్ సురేశ్.. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన మెన్స్ 50 కేజీల ఫైనల్లో విశ్వనాథ్ 5–0తో దైచీ ఇవాయ్ (జపాన్)పై నెగ్గాడు. బౌట్ ఆరంభం నుంచే పదునైన పంచ్‌లతో విరుచుకుపడిన ఇండియన్ బాక్సర్ వరుసగా పాయింట్లు నెగ్గాడు.
అప్పర్ కట్స్, హుక్స్‌తో ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. 60 కేజీల కేటగిరీలో సచిన్ రజతం సాధించాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇండియా 5 స్వర్ణాలతో కలిపి 16 మెడల్స్‌ను కైవసం చేసుకోగా, కజకిస్తాన్ ఆరు స్వర్ణాలతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇండియా విమెన్స్ టీమ్ 4 స్వర్ణాలు, 2 రజతాలు, 4 కాంస్యాలతో సహా మొత్తం 10 మెడల్స్‌ను నెగ్గి టాప్ ప్లేస్‌తో సరికొత్త చరిత్ర సృష్టించింది.
