హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌లో పని చేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 61 ఏండ్లకు పెంచాలని టూరిజం ఎంప్లాయీస్యూనియన్ కోరింది. ఈ మేరకు శుక్రవారం సెక్రటేరియట్లో టూరిజం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణి ప్రసాద్ కు సంఘం గౌరవ అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి వినతిపత్రం అందజేశారు
రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ విభాగాల మాదిరిగానే టూరిజం కార్పొరేషన్‌లోనూ ఉద్యోగ విరమణ వయసును పెంచి, ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రాట్యుటీని కూడా పెంచాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సీహెచ్.రాజయ్య, రమేశ్, రాజశేఖర్, బల్వీర్, తిరుపతి, భద్రన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
