మహబూబాబాద్, వెలుగు: ప్రజలు ఆయుర్వేద, హోమియోపతి, యునాని వైద్య సేవలు వినియోగించుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీశ్ కోరారు. శుక్రవారం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఆయూష్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించి, మాట్లాడారు. అక్కడ 384 మందికి వైద్యసేవలను అందించడం హర్షనీయమన్నారు. ఔషధ మొక్కలను నాటితే ఉపయోగపడుతుందని, అందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ వో రవి రాథోడ్, హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, డాక్టర్లు పాల్గొన్నారు.
