సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా : ఎమ్మెల్యే సంజయ్ కుమార్
  •     ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్‌‌‌‌‌‌‌‌, వెలుగు: సమాజానికి సేవ చేసేందుకే రాజకీయాలకు వచ్చానని.. కానీ కొందరు కావాలని తనపై  బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో రూ.35 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీట్ బజార్ మార్కెట్ విషయంలో ఓ నాయకుడు.. గతంలో ధరూర్–చల్గల్ బైపాస్ రోడ్డు నిర్మించి అక్కడ రైల్వే గేట్ పెట్టడంతో పదేండ్లు నిరుపయోగంగా ఉందని, తానే ఆ రోడ్డును వినియోగంలోకి తెచ్చినట్లు గుర్తుచేశారు. తనను విమర్శించే నాయకులు నిలిచిపోయిన పనులను పూర్తి చేయించాలని కోరారు. అనంతరం కేజీబీవీలో నాబార్డ్ నిధులు రూ 80 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు.