
‘లైగర్’ సినిమా జనం ముందుకు రాకముందే పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ‘జనగణమన’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం రీసెంట్‌గా స్టార్టయింది. మరోవైపు ‘లైగర్’ పోస్ట్ ప్రొడక్షన్ జెట్ స్పీడుతో జరుగుతోంది. ఇందులో మైక్ టైసన్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తాజాగా తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ వర్క్‌ను పూర్తి చేశారు టైసన్. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ కాంబినేషన్‌లో వచ్చే సీన్స్‌ను ఆమధ్య అమెరికాలో షూట్ చేశారు. ఈ సీన్స్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయంటున్నారు. ఫైట్ సీక్వెన్సులతో పాటు కథను మలుపు తిప్పే ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆయన నటించారట. టైసన్‌తో కలిసి నటించడం గురించి ఇటీవల ‘జనగణమన’ ఓపెనింగ్‌లో మాట్లాడాడు విజయ్. ఓ సీన్‌లో విజయ్ ఫేస్‌పై పంచ్ ఇస్తారట టైసన్. ఆ పంచ్‌కి విజయ్ బ్రెయిన్ షేక్ అయ్యిందట. అయినా తట్టుకుని నిలబడ్డాడట. అదే విషయాన్ని చెబుతూ ‘టైసన్ పంచ్‌నే తట్టుకుని నిలబడ్డానంటే ఇక దేన్నయినా తట్టుకోగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది’ అన్నాడు. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్‌పాండే, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషించారు. . పూరి, చార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి నిర్మించారు. ఆగస్టు 25న సినిమా విడుదల కానుంది.