ఆ కంఫర్ట్ ఎప్పుడూ లేదు..

ఆ కంఫర్ట్ ఎప్పుడూ లేదు..

‘శివ మనసులో శృతి’ చిత్రంతో సుధీర్‌‌‌‌‌‌‌‌బాబు హీరోగా పరిచయమై ఇవాళ్టికి పదేళ్లయ్యింది. ఈ సందర్భంగా తన కెరీర్‌‌‌‌‌‌‌‌ గురించి ఇలా ముచ్చటించాడు సుధీర్. 
కొన్ని ప్రిన్సిపుల్స్‌‌‌‌తో ఇండస్ట్రీకొస్తాం. వాటిని బ్రేక్ చేయకుండా ప్రతి సినిమాకీ హండ్రెడ్ పర్సెంట్‌‌‌‌ ఎఫర్ట్ పెడుతున్నాను. ఈ పదేళ్లలో కొన్ని వర్కవుటయ్యాయి కొన్ని సక్సెస్ కాలేదు. మిస్టేక్స్‌‌‌‌ నుంచి ఎన్నో నేర్చుకున్నాను తప్ప రిగ్రెట్స్ అయితే లేవు. ఇప్పటి వరకు నటించిన ప్రతి సినిమా డిఫికల్టే. ఇప్పుడు తెరపై చూస్తుంటే ఈజీగా ఉంటుంది కానీ సెట్‌‌‌‌లో అడుగు పెడుతున్నప్పుడు ఎలా చేస్తానో అనే భయం ప్రతిసారీ ఉండేది. ఆ భయం వల్లే గ్రౌండ్‌‌‌‌ వర్క్ చేస్తాం, ప్రిపేరవుతాం. ‘బాగీ’ కోసం బాలీవుడ్‌‌‌‌ నుంచి కాల్ వస్తే నమ్మలేదు. చిన్న క్యారెక్టరేమో నో చెబుదామనుకున్నా. మంచి క్యారెక్టర్ కావడంతో చేశాను. ‘బ్రహ్మాస్త్ర’లోనూ మెయిన్‌‌‌‌ విలన్‌‌‌‌గా అడిగారు. అదే టైమ్‌‌‌‌లో ‘సమ్మోహనం’ ఆఫర్ రావడం, అది కొత్తగా ఉండటం, ఆల్రెడీ విలన్ రోల్ చేసుండడంతో నో అన్నాను. పదేళ్ల కెరీర్‌‌‌‌‌‌‌‌లో పద్నాలుగు సినిమాలు చేశాను. ఇరవై నాలుగ్గంటలూ వర్క్ చేయడానికి సిద్ధం. కానీ ఏ సినిమా పడితే అది చేయలేను. పెద్ద డైరెక్టర్స్‌‌‌‌ అందరితో వర్క్ చేయాలనుంది. కానీ కొత్తవాళ్లతో చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు. కొత్త మైండ్​సెట్‌‌‌‌తో వస్తారు. వాళ్ల లైఫ్‌‌‌‌ అంతా మనం గుర్తుండిపోతాం. ఇప్పటి వరకు చేసిన వాటిలో ఏ జానర్ సినిమాల్లోనూ నాకు కంఫర్ట్ లేదు. ఇకపై యాక్షన్ మూవీస్ చేయాలనుకుంటున్నాను. చేయబోయే మూడు సినిమాలు యాక్షన్‌‌‌‌ స్టంట్స్‌‌‌‌కి బెంచ్‌‌‌‌మార్క్ అవుతాయి. హర్ష డైరెక్షన్‌‌‌‌లో ఒకటి, భవ్య క్రియేషన్స్‌‌‌‌లో ఒకటి, ‘లూజర్’ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌తో ఒక ప్రాజెక్ట్ ఉంటాయి. ఇక ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ త్వరలో రిలీజ్. పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా చేయబోతున్నా. నిర్మాతలెవరూ రాకపోవడంతో నా ఫస్ట్ మూవీని నేనే ప్రొడ్యూస్ చేశా. బ్రేక్‌‌‌‌ టైమ్‌‌‌‌లో ‘ఈ అబ్బాయి కష్టం, ఫొటోజెనిక్‌‌‌‌గా లేడు’ అని స్టడీ క్యామ్ కెమెరామేన్, అతని అసిస్టెంట్ మాట్లాడుకోవడం విని బాధేసింది. అప్పటికే చాలా డబ్బు పెట్టాను కనుక వెనక్కి తగ్గలేను. దాంతో పెర్ఫార్మెన్స్‌‌‌‌తోనే ముందుకెళ్లాలని ఫిక్సయ్యాను. నెగిటివిటీతో వర్క్ చేయలేనని అతన్ని తీసేసినా, కొన్నేళ్లకు మళ్లీ పిలిపించాను. ఎందుకంటే అతని మాటల వల్లే మోటివేట్ అయ్యి నటనపై ఫోకస్ పెట్టగలిగాను. నా పిల్లలకి కూడా యాక్టింగ్‌‌‌‌ అంటే ఇంటరెస్ట్. ‘భలే భలే మగాడివోయ్‌‌‌‌’లో నటించిన పెద్దబ్బాయి చరిత్, ఇప్పుడో సినిమాలో నా  చిన్నప్పటి పాత్ర చేస్తున్నాడు. ‘గూఢచారి’లో చేసిన చిన్న బ్బాయి దర్శన్ ‘సర్కారు వారి పాట’లో చిన్నప్పటి మహేష్‌‌‌‌గా నటిస్తున్నాడు. ఫ్యామిలీకి కూడా టైమ్ కేటాయించాలని కృష్ణ గారు, మహేష్‌‌‌‌ బాబుల నుంచి నేర్చుకున్నాను. వాళ్లున్నారని కాకుండా నన్ను నేను ప్రూవ్‌‌‌‌ చేసుకోవాలని ఇండస్ట్రీకి వచ్చాను. అందుకే నా కెరీర్‌‌‌‌‌‌‌‌కి సంబంధించి ఎలాంటి హెల్ప్ వాళ్లని అడగను.’’