సమంత లీడ్‌గా నందినీ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంతకు చెందిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
అతిథులుగా హాజరైన నిర్మాతలు డి.సురేష్ బాబు, మైత్రీ రవి శంకర్, స్వప్నాదత్, జాన్వీ నారంగ్, డైరెక్టర్ దేవా కట్టా సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ‘నా నుంచి సినిమా వచ్చి మూడేళ్లు అవుతున్నా నాపై ప్రేమ చూపిస్తున్న అభిమానులకు థ్యాంక్స్. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేయాలనుకుంటున్నా. ఇప్పుడు అయితే ఓ మంచి చిత్రాన్ని చేశాం. ఇప్పటివరకు నేను నటిగా ఎంత ఎంజాయ్ చేశానో.. నిర్మాతకు ఉండే కష్టాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఈ సినిమా కోసం ప్రతి డిపార్ట్‌మెంట్ ప్రాణం పెట్టి పని చేసింది. రాజ్ అండ్ డీకే, నందినీ రెడ్డి నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. అందరినీ ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది’ అని చెప్పింది.
ఇప్పటివరకు చూసిన సమంత కంటే.. పది రెట్ల సమంతను ఇందులో చూస్తారు అని డైరెక్టర్ నందినీ రెడ్డి అన్నారు. తమకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ నిర్మాత రాజ్ నిడిమోరు థ్యాంక్స్ చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
