
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని గత నెల రోజులుగా ఢిల్లీలో రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రెజ్లర్ ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. తనపై చేసిన ఆరోపణలలో ఏ ఒక్కటి రుజువైనా తాను ఉరి వేసుకుంటానని అన్నారు. యాపీలోని బారాబంకిలో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తాము సాధించిన పతకాలను గంగానదిలో పడవేస్తామని రెజ్లర్లు ప్రటించడంపై మాట్లాడిన బ్రిజ్ భూషణ్.. అదంతా ఎమోషనల్ డ్రామా అని అన్నారు. రెజ్లర్లు వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే దానిని కోర్టులో సమర్పించాలని అప్పుడు తాను ఎలాంటి శిక్షనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని బ్రిజ్ భూషణ్ వెల్లడించారు.
గంగానదిలో మెడల్స్‌ను నిమజ్జనం చేసేందుకు 2023 మే 30 మంగళవారం రోజు సాయంత్రం హరిద్వార్ వద్దకు రెజ్లర్లు చేరుకోగా.. అక్కడ హైడ్రామా నెలకొంది. అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు సైతం ప్రయత్నించాయి. అయితే రైతు సంఘం నేత నరేష్ తికాయత్ జోక్యంతో రెజ్లర్లు శాంతించి.. బ్రిజ్‌పై చర్యలకు కేంద్రానికి ఐదురోజుల గడువు విధించారు.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు దీనిపై విచారణ చెపడుతున్నారు.