కిమ్ మంచిగా ఉండాలి ట్రంప్

కిమ్ మంచిగా ఉండాలి ట్రంప్

వాషింగ్టన్ : నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ హెల్దీగా ఉండాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. కిమ్ హెల్త్ సీరియస్ గా ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన రియాక్ట్ అయ్యారు. ఒక వేళ కిమ్ హెల్త్ బాగాలేకపోతే ఆయన త్వరగా కోలుకువాలని ప్రార్థిస్తున్నాను అని చెప్పారు. నార్త్ కొరియాతో అమెరికాకు మంచి సంబంధాలున్నాయని ఈ సందర్భంగా ట్రంప్ అన్నారు. కిమ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో ఇంతకన్నా ఏం చెప్పలేను. కిమ్ ఆరోగ్యం పై వచ్చిన రిపోర్ట్ ల ప్రకారం ఆయన హెల్త్ సీరియస్ గా ఉంటే అది తీవ్రమైన విషయమే అని ట్రంప్ అన్నారు. కిమ్ ఆరోగ్యం గురించి ఏమైనా సమాచారం ఉందా అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. కార్డియోవాస్క్యులర్ సర్జరీ తర్వాత కిమ్ ఆరోగ్యం సీరియస్ గా మారిందని సీఎన్ఎన్ న్యూస్ తెలిపింది. తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జాంగ్ హాజరుకానప్పటి నుంచే ఆయన హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందంటూ ప్రచారాలు మొదలయ్యాయి.