కార్గిల్ ఎయిర్​స్ట్రిప్​పై ఐఎఫ్​సీ 130 జే ల్యాండింగ్

కార్గిల్ ఎయిర్​స్ట్రిప్​పై ఐఎఫ్​సీ 130 జే ల్యాండింగ్

న్యూఢిల్లీ: కార్గిల్ ఎయిర్​స్ట్రిప్​పైన ఐఎఫ్​సీ 130జే విమానాన్ని విజయంతంగా ల్యాండ్ చేసినట్టు ఇండియన్ ఎయిర్​ఫోర్స్(ఐఏఎఫ్) ఆదివారం ఉదయం ప్రకటించింది. అత్యంత కఠినమైన కార్గిల్ పర్వతాల్లోని ఎయిర్​స్ట్రిప్​పై ఎయిర్​క్రాఫ్ట్ ల్యాండింగ్ ఇదే ఫస్ట్​ టైమ్ అని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. గరుడ్ కమాండోల ట్రైనింగ్​లో భాగంగా ఈ విన్యాసం చేసినట్టు ప్రకటించింది. టెర్రైన్ మాస్కింగ్​ను కూడా ఉపయోగించినట్టు వెల్లడించింది. కార్గిల్ ఎయిర్ స్ట్రిప్​ హిమాలయాల్లో 8 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. రాత్రిపూట ల్యాండింగ్ చేయడం బాగా అనుభవజ్ఞులైన పైలెట్లకు మాత్రమే సాధ్యమని ఐఏఎఫ్ తెలిపింది. ప్రతికూల వాతావరణంలోనూ ఎయిర్​క్రాఫ్ట్​ను సేఫ్​గా ల్యాండ్ చేసేలా పైలెట్లకు ట్రైనింగ్ ఇచ్చినట్టు పేర్కొంది. ఆర్మీ బలగాలు, యుద్ధ సామగ్రి తరలింపులో ఐఎఫ్​సీ 130జే ఎయిర్​క్రాఫ్ట్​లది కీలకపాత్ర.