మరోసారి పోలీసుల కస్టడీకి ఐబొమ్మ రవి

మరోసారి పోలీసుల కస్టడీకి ఐబొమ్మ రవి

బషీర్​బాగ్, వెలుగు: సినిమా పైరసీ కేసులో అరెస్టయి చంచల్‌‌గూడ జైలులో రిమాండ్‌‌లో ఉన్న ఐబొమ్మ వెబ్‌‌సైట్  నిర్వాహకుడు ఇమ్మడి రవిని కస్టడీ విచారణకు అప్పగించేందుకు నాంపల్లి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. రవిపై మొత్తం ఐదు కేసులు నమోదు కాగా, వాటిలో ఒక కేసులో ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టారు. పలు కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్లు సమాచారం. తాజాగా మూడు కేసుల్లో 12 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. 

ఈ మూడు కేసుల్లో ఒక్కో కేసుకు నాలుగు రోజుల చొప్పున కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఈనెల 18 నుంచి ఆయనను కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టనున్నారు. కాగా, మరో ఒక కేసులో కస్టడీపై తీర్పును బుధవారానికి కోర్టు వాయిదా వేసింది.