
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్) వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్(సీఆర్పీసీఎస్ఏ–XV) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 10,277 పోస్టులను భర్తీచేయనున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. ఆగస్టు 1 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ 21.
పాల్గొనే బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.
పోస్టుల సంఖ్య: 10,277. తెలంగాణ రాష్ట్రంలో 261( బ్యాంక్ ఆఫ్ బరోడా 51, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 01, కెనరా బ్యాంక్ 135, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 1, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 07, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 14, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 16)
వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 20 ఏండ్లు. గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. లేదా 1997ఆగస్టు 02 కంటే ముందు - 2005 ఆగస్టు 1 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వితంతు, విడాకులు, చట్టబద్ధంగా వేరుపడిన మహిళలకు గరిష్ట వయోపరిమితి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35 ఏండ్లు, ఓబీసీలకు 38 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు 40 ఏండ్ల వరకు ఉంటుంది.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
లాస్ట్ డేట్: ఆగస్టు 21.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్, డీఈఎస్ఎం అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.850.
ప్రిలిమినరీ: అక్టోబర్ 2025.
మెయిన్ (ఆన్లైన్ ఎగ్జామినేషన్): నవంబర్ 2025.
తాత్కాలిక కేటాయింపు: మార్చి 2026.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. టైర్–1లో ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్, టైర్–2లో ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్‌కు షార్ట్‌లిస్ట్ చేస్తారు. మెయిన్ తర్వాత తాత్కాలిక కేటాయింపునకు ముందు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
ప్రిలిమ్స్ సిలబస్
ఇంగ్లిష్ లాంగ్వేజ్: వొకాబులరీ, గ్రామర్, స్పాటింగ్ ఎర్రర్స్, పద బంధాలు – జాతీయాలు, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్, యాక్టివ్/ పాసివ్ వాయిస్.
రీడింగ్ కాంప్రహెన్షన్: థీమ్ డిటెక్షన్, పాసేజ్ కంప్లిషన్, టాపిక్ రీ ఆరెంజ్మెంట్ ఆఫ్ పాసేజ్, డెరైవింగ్ కన్క్లూజ్.
రీజనింగ్ ఎబిలిటీ
వెర్బల్ రీజనింగ్: అనాలజీ, క్లాసిఫికేషన్, వర్డ్ ఫార్మేషన్, స్టేట్మెంట్ అండ్ కన్‌క్లూజన్, సిలోజిమ్స్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, కోడింగ్– డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, పాసేజ్ అండ్ కన్‌క్లూజన్, ఆల్ఫాబెట్ టెస్ట్, సిరీస్ టెస్ట్, నంబర్/ ర్యాంకింగ్/ టైమ్ సీక్వెన్స్, డైరెక్షన్ టెస్ట్, డిసిషన్ మేకింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, అసర్షన్ అండ్ రీజనింగ్.
నాన్ వెర్బల్ రీజనింగ్: ఫిగర్ సిరీస్, ఇన్పుట్/ అవుట్ పుట్, సరీస్ టెస్ట్, ఆడ్ ఫిగర్ అవుట్, అనాలజీ, మిసిలేనియస్ టెస్ట్.
పూర్తి వివరాలకు www.ibps.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ : ఇది క్వాలిఫై ఎగ్జామ్ మాత్రమే. ఇందులో వచ్చిన మార్కులు తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్–1లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, సెక్షన్–2లో న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులకు, సెక్షన్–3లో రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులకు మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి సెక్షన్‌కు 20 నిమిషాల సమయం ఇస్తారు. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. అభ్యర్థులు మెయిన్‌కు అర్హత సాధించాలంటే మూడు సెక్షన్లలో వేర్వేరుగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది.
మెయిన్ ఎగ్జామినేషన్ : ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో వచ్చిన మార్కులనే ఫైనల్ మెరిట్‌గా పరిగణిస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్‌లో నాలుగు సెక్షన్లు ఉంటాయి. మొత్తం 155 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్–1లో జనరల్/ ఫైనాన్స్ అవేర్నెస్ 40 ప్రశ్నలు 50 మార్కులకు (20 నిమిషాల సమయం), జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు 40 మార్కులకు (35 నిమిషాల సమయం), రీజనింగ్ ఎబిలిటీ 40 ప్రశ్నలు 60 మార్కులకు (35 నిమిషాల సమయం), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలు 50 మార్కులకు మొత్తం 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. రెండు గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
ఎల్ఎల్పీటీ : ఏదైనా ఒక రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతానికి మాత్రమే అభ్యర్థులు అప్లై చేయాల్సి ఉంటుంది. సంబంధిత రాష్ట్రంలో స్థానికంగా మాట్లాడే భాషల్లో ఏదో ఒక దాంట్లో తగిన ప్రావీణ్యం ఉండాలి. అంటే చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉండాలి. ఇందుకోసం లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్టు(ఎల్ఎల్పీటీ)ను నిర్వహిస్తారు. ఈ పరీక్ష మెయిన్ ఎగ్జామినేషన్ తర్వాత తాత్కాలిక కేటాయింపునకు ముందు ఉద్యోగం ఆఫర్ చేసే బ్యాంక్ నిర్వహిస్తుంది. ఎల్ఎల్పీటీలో అభ్యర్థులు తప్పకుండా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఒకవేళ విఫలమైతే నియామక ఉత్తర్వులు ఇవ్వరు, అనర్హులుగా ప్రకటిస్తారు.