V6 News

ఇబ్రహీంపట్నం అభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం అభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.