
న్యూఢిల్లీ: చార్టర్డ్ అకౌంటెంట్ల అత్యున్నత సంస్థ ఐసీఏఐ... ఆర్థిక మోసాలను ఎదుర్కోవడంలో మార్కెట్రెగ్యులేటర్సెబీకి సహాయం చేయడానికి ఒక పరిశోధనా పత్రాన్ని తయారు చేస్తోంది. ఆర్థిక మోసాలను అరికట్టడానికి సంబంధించిన వివిధ అంశాలను ఖరారు చేయడానికి ఇన్స్టిట్యూట్ ఒక వర్కింగ్ గ్రూపును నియమించింది. ఇది సెబీతో చర్చలు జరుపుతున్నదని ఐసీఏఐ ప్రెసిడెండ్ చరణ్‌జోత్ సింగ్ నందా శనివారం తెలిపారు.
ఈ విషయంలో వర్కింగ్ గ్రూప్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పిస్తుందని వెల్లడించారు. నందా సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండేతో శుక్రవారం సమావేశమయ్యారు. పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటం సెబీకి ముఖ్యమని, మోసాలను నివారించడానికి ఒక వ్యవస్థను అభివృద్ధి చేస్తామని పాండే అన్నారు.