ICC Approves Pink Ball: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) క్రికెట్ నిబంధనల్లో కొన్ని కీలక మార్పులు చేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్‌లు, టీ20 మ్యాచ్‌ల నిబంధనలతో పాటు టెక్నాలజీ వాడకంపై కీలక మార్పులు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త రూల్స్ అన్నీ అక్టోబర్ 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి.
కీలక నిర్ణయాలు:
టెస్ట్ మ్యాచ్‌ల్లో పింక్ బాల్ ట్రయల్స్
టెస్ట్ క్రికెట్‌లో పింక్ బాల్ (Pink Ball) వినియోగాన్ని ఐసీసీ ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. మ్యాచ్ ఆడే రెండు జట్లు ముందే అంగీకరిస్తేనే ఈ ట్రయల్స్ నిర్వహిస్తారు. మ్యాచ్ జరిగే సమయంలో వెలుతురు తగ్గినప్పుడు (Bad Light) ఆట నిలిచిపోకుండా, ఆటను కొనసాగించడమే దీని ముఖ్య ఉద్దేశం.
లైటింగ్ టెక్నాలజీపై పరిశోధన:
తక్కువ వెలుతురు కారణంగా మ్యాచ్‌లు రద్దు కాకుండా ఉండేందుకు, మ్యాచ్ రిఫరీలు, వేదికల కోసం సరికొత్త 'లైటింగ్ టెక్నాలజీ'పై ఐసీసీ రీసెర్చ్ చేయనుంది. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల కోసం ఎంసీసీ (MCC)తో కలిసి ఐసీసీ నిధులు సమకూర్చనుంది.
బౌలింగ్ యాక్షన్ రివ్యూ కోసం హాక్-ఐ డేటా:
బౌలర్ల బౌలింగ్ యాక్షన్ చట్టవిరుద్ధంగా (Illegal Bowling Action) ఉందా లేదా అని నిర్ధారించడానికి, రిపోర్ట్ చేయడానికి మ్యాచ్ అధికారులు ఇకపై 'హాక్-ఐ' డేటాను ఉపయోగించుకోవచ్చు.
ALSO READ : కెనడా క్రికెట్ జట్టుకి బిగ్ షాక్.. సస్పెండ్ చేసిన ఐసీసీ
ఆట నిబంధనలలో అప్‌డేట్స్:
* కోచ్‌ల సంప్రదింపులు: మ్యాచ్‌లో నిర్ణీత డ్రింక్స్ ఇంటర్వెల్స్ సమయంలో హెడ్ కోచ్‌లు లేదా వారి ప్రతినిధులు తమ జట్లతో సంప్రదింపులు జరపవచ్చు..
* టీ20ల్లో కచ్చితమైన విరామం: టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో తప్పనిసరిగా 15 నిమిషాల ఇంటర్వెల్ ప్రవేశ పెట్టనున్నారు.
* బ్యాటర్ల సన్నద్ధత: ఏదైనా విరామం తర్వాత ఆట తిరిగి ప్రారంభమయ్యేటప్పుడు బ్యాటర్లు వెంటనే సిద్ధంగా ఉండాలి.
* లెగ్‌సైడ్ వైడ్స్ రూల్ పర్మనెంట్: ఇప్పటి వరకు ట్రయల్ రూపంలో ఉన్న 'లెగ్‌సైడ్ వైడ్స్' నిబంధనను ఐసీసీ శాశ్వతంగా ఆమోదించింది.
* అఫీషియల్ క్రికెట్ వర్గీకరణ: క్రికెట్ వరల్డ్ కప్ ఛాలెంజ్ లీగ్‌లో పోటీ పడే జట్లు.. ప్రతి ఛాలెంజ్ లీగ్ టోర్నమెంట్ సైకిల్‌లో ఇతర లిస్ట్-ఎ (List A) పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడేందుకు అర్హత కలిగి ఉంటాయి.
