
టీమిండియా కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ గ్లోవ్స్‌పై ఇండియన్ ఆర్మీ గుర్తును తొలగించాలని BCCIని ICC కోరింది. ప్రపంచకప్-2019 పోరులో సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఇండియన్ పారా స్పెషల్ ఫోర్సెస్ గుర్తు ముద్రించిన కీపింగ్ గ్లోవ్స్‌ను ధరించాడు. దీనిపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు. కానీ, ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో తర్వాతి మ్యాచ్‌లో ఆ గుర్తును తొలగించాలని బీసీసీఐకి సూచించినట్టు ఐసీసీ జనరల్ మేనేజర్ క్లైర్ ఫుర్లాంగ్ తెలిపారు.
ఆటగాడు కేవలం స్పాన్సర్ ల లోగోలను మాత్రమే వేసుకోవాలని ఐసీసీ తెలిపింది. అయితే.. ధోనీ భారత సాయుదబలగాల త్యాగాలకు గుర్తుగా ఉండే బలిదాన్ బ్యాడ్జ్ ను ధరించడం వల్ల ప్రస్తుతం ఎటువంటి ఫైన్ ను విధించడం లేదని చెప్పింది. తాము ధోనీని అర్థం చేసుకున్నామని అయితే ఎవరైనాసరే నిబంధనలకు అనుగునంగానే నడుచుకోవాలని ICC కోరింది.