క్రికెట్ కెనడాపై ఐసీసీ సస్పెన్షన్ వేటు.. దిద్దుబాటు చర్యలు ప్రారంభం

క్రికెట్ కెనడాపై ఐసీసీ సస్పెన్షన్ వేటు.. దిద్దుబాటు చర్యలు ప్రారంభం

టొరంటో: నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినందుకు క్రికెట్ కెనడా సభ్యత్వాన్ని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అవినీతి, ఆర్థిక లోపాలపై దర్యాప్తు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఆటగాళ్ల ప్రయోజనాల దృష్ట్యా కెనడా జాతీయ జట్లు ఐసీసీ ఈవెంట్లలో ఆడడానికి అర్హత కలిగి ఉంటాయని తెలిపింది. ఈ నిర్ణయంపై స్పందించిన క్రికెట్ కెనడా.. ఈ సస్పెన్షన్ ఊహించనిదని పేర్కొంది. 

ఐసీసీ నిర్ణయాన్ని గౌరవిస్తూనే, పాలనాపరమైన, ఆర్థిక లోపాలను సరిదిద్దడానికి సమగ్ర దిద్దుబాటు చర్యలను, సంస్కరణలను అత్యంత వేగంగా ప్రారంభించినట్లు బోర్డు వెల్లడించింది. కాగా ఐసీసీ విధించే షరతులను పూర్తిగా నెరవేర్చిన తర్వాతే సభ్యత్వం పునరుద్ధరణ ఆధారపడి ఉంటుందని క్రీడా నిపుణులు తెలిపారు.