అండర్‌-19 వరల్డ్ కప్ .. ఫైనల్కు భారత్

అండర్‌-19 వరల్డ్ కప్ ..  ఫైనల్కు భారత్

అండర్‌-19 వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్ కు చేరుకుంది.  2024 ఫిబ్రవరి 06వ తేదీన బెనోని వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను రెండు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది.  తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.  అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 48.5  ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.  

ఛేజింగ్ లో భారత్ 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో భారత్‌ తీవ్ర ఒత్తిడిలోకి జారుకుంది. ఈ క్రమంలో  కెప్టెన్‌ ఉదయ్‌ సహరన్‌ (81*), సచిన్‌దాస్‌ (96) వీరోచితంగా పోరాడారు.  దీంతో భారత్ విజయం సాధించింది.  దక్షిణాఫ్రికా బౌలర్లలో  క్వెనా మఫాకా, ట్రిస్టాన్‌లూస్‌ చెరో మూడు వికెట్లు తీశారు. ఫిబ్రవరి 8వ తేదీన ఆస్ట్రేలియా,పాకిస్థాన్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 

ALSO READ :- శరద్ పవార్ కు భారీ షాక్.. ఎన్సీపీ అజిత్ పవార్ దే..!

ఈ మ్యాచ్ లో గెలిచిన  జట్టుతో భారత్ ఈనెల 11న (ఆదివారం) బెనోని వేదికగా ఫైనల్ లో తలపడనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ ..  టోర్నీ ఆరంభం నుంచి ఓటమన్నదే లేకుండా తుదిపోరుకు అర్హత సాధించడం విశేషం.  కాగా  అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలో భారత్  ఐదు టైటిళ్లను గెలుచుకుని టాప్ లో ఉంది.