
భగభగమండే ఎండల్లో రోడ్డుపై ఆమ్లెట్ వేయవచ్చంటారు. సమ్మర్ లో కొంతమంది ఇలాంటి ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. బాగా ఎండలు కొడుతున్నాప్పుడు గుడ్డును పగలగొట్టి రోడ్డుపై పోయగానే.. అది కొంతసేపటికి ఆమ్లెట్ అవడం కామన్. కానీ.. ఐస్ గడ్డలపై ఆమ్లెట్ వేయడం మీరు ఎప్పుడైనా చూశారా.. వినడానికి ఇది విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజం. అమెరికాలో కురుస్తున్న హిమపాతానికి అక్కడి నదులు, సరస్సులు గడ్డకట్టిపోవడం, రహదారులు, ఇళ్లు మంచుమయం కావడంతో యువత కాస్త వెరైటీగా ఆలోచిస్తున్నారు.
వేడివేడి పెనంపై ఆమ్లెట్ వేస్తే మజా ఏముంది? గడ్డకట్టిన మంచుపై వేసి చూద్దామనుకున్నారు. తీరా వేస్తే.. వెడల్పు చేసే అవకాశం ఇవ్వకుండా వెంటనే గడ్డకట్టి పోతోందట. గడ్డకట్టిన ఆమ్లెట్ ను కాస్త ఉప్పు, కారం కలిపి తింటే టేస్టీగా ఉండడంతో లాగించేస్తున్నారట. దీనికి ఐస్ ఆమ్లెట్ అని పేరు పెట్టి, ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా మంచుతో ఎన్నో ప్రయోగాలు చేస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు భలే ఫన్నీగా ఉంటున్నాయి.