
అమెరికా అధ్యక్షుడి గురించి ఏ వార్త వచ్చినా అది వైరల్ అవ్వటం ఖాయం. కొన్నిసార్లు విచిత్రమై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. కానీ ఈసారి తన ప్రమేయం లేకుండానే తనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ ఫుల్ గా ట్రోల్స్ చేస్తున్నారు.
ట్రంప్ విమానం ఎక్కువతూ తూలిపడి పడిపోయిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఆదివారం (జూన్ 8) ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కుతూ ఒక్కసారిగా పడిపోబోయాడు. న్యూజెర్సీ మ్యారిస్టౌన్ లోని మున్సిపాలిటీ ఎయర్ పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను గత ప్రసిడెంట్ బైడన్ తో పోల్చుకుని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. బైడెన్ కూడా గతంలో ఇలాగే పడిపోబోయారు. దీంతో అప్పట్లో ట్రంప్ అధికారం నుంచి దిగిపోయే టైమ్ వచ్చిందని కొందరు కామెంట్స్ చేశారు. ట్రంప్ ను కూడా అలాగే ఆడేసుకుంటున్నారు.
అయితే ట్రంప్ పడిపోబోయిన అదే రోజు యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబిరో కూడా తూలిపడిపోవడం గమనార్హం. ప్రసిడెంట్ ట్రంప్ మెట్లు ఎక్కుతూ పడిపోబోయి.. వెంటనే రికవర్ అయ్యాడు. అయితే పడిపోయే ముందు ట్రంప్ ఇచ్చి ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
ఇతను ట్రంపా.. బైడెనా.. ట్రంప్ మానసిక పరిస్థితి గురించి ఏ మీడియా మాట్లాడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజరైతే ఏకంగా ‘‘డొనాల్డ్ ట్రంప్ విమానం మెట్లు కూడా ఎక్కలేకపోతున్నారు.. యూఎస్ ప్రసిడెంట్ గా ఆయన అనర్హుడు’’ అని ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
‘‘బైడెన్ లాగే ట్రంప్ తూలిపడబోయాడు.. ట్రంప్ కు బైడెన్ పూనిండేమో.. ’’ అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు.
‘‘ఇదే బైడన్ జారి పడిపోబోయినప్పుడు వాల్ టు వాల్ కవరేజ్ ఇచ్చిన మీడియా.. ఆయన వయసు అయిపోయింది.. ప్రసిడెంట్ గా పనిచేయలేడనేలా ఎజెండా సెట్ చేసింది. కానీ ట్రంప్ విషయంలో మీడియా వైఖరి వేరేలా ఉంది. దీన్నిబట్టి మీకు ఏమర్థమవుతుంది’’ అని అంటున్నారు యూజర్లు.
Time to get Old Man Trump fitted for a wheelchair. https://t.co/dY3U4RKlsY
— Ron Filipkowski (@RonFilipkowski) June 8, 2025