
హైదరాబాద్ : ఐసెల్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారు అయ్యాయి. 2019 స్టడీ ఇయర్ కు సంబంధించిన MCA, MBA అడ్మిషన్ల కోసం ఐసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను శనివారం రిలీజ్ చేసింది ఉన్నత విద్యాశాఖ. ఆగస్టు 6వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఐసెట్ స్లాట్ బుక్ చేసుకోవాలని తెలిపింది.
ఆగస్టు 8వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఆగస్టు 8వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంట్రీ చేసుకోవాలి. ఆగస్టు 14వ తేదీన MCA, MBA సీట్లను కేటాయించనున్నట్లు తెలిపింది.