ఇవాళ ( జులై 7 ) ఐసెట్ ఫలితాలు

ఇవాళ ( జులై 7 ) ఐసెట్ ఫలితాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ  కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్–2025 ఫలితాలు సోమవారం రిలీజ్ కానున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో మధ్యాహ్నం 3గంటలకు అధికారులు వీటిని విడుదల చేయనున్నారు. మహాత్మాగాంధీ వర్సిటీ ఆధ్వర్యంలో గతనెల 8,9 తేదీల్లో ఎగ్జామ్ నిర్వహించారు. 

ఈ పరీక్షలకు 71,757  మంది రిజిస్ర్టేషన్ చేసుకోగా, 64,938 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను https://tgche.ac.in వెబ్ సైట్​లో అధికారులు అందుబాటులో ఉంచనున్నారు.