ఐసీహెచ్ ఆర్(ICHR) లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఖాళీలు..అప్లయ్ చేసుకోండిలా

ఐసీహెచ్ ఆర్(ICHR) లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్  ఖాళీలు..అప్లయ్ చేసుకోండిలా

చరిత్రపై పరిశోధన (Research) చేయాలనుకునే విద్యార్థులకు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐసీహెచ్‌ఆర్ (ICHR) గొప్ప అవకాశం కల్పిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. చరిత్రలో పీహెచ్‌డీ (PhD) చేస్తున్న విద్యార్థులకు ఆర్థిక చేయూతనివ్వడం ఈ ఫెలోషిప్ ప్రధాన ఉద్దేశం. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 20న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తుంది.

మొత్తం ఫెలోషిప్‌లు: సుమారు 80 (రిజర్వేషన్ నిబంధనల ప్రకారం).

ఫెలోషిప్ మొత్తం: నెలకు రూ. 17,600 స్టైపెండ్ అందిస్తారు.

అదనపు నిధులు : ఏడాదికి రూ. 16,500 అదనంగా లభిస్తాయి.

కాలపరిమితి: రెండేళ్లు (2 Years).. ప్రత్యేక పరిస్థితుల్లో ఎలాంటి ఆర్థిక సాయం లేకుండా మరో సంవత్సరం వరకు పొడిగించవచ్చు,

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మార్చి 20. 

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500. 

లాస్ట్ డేట్: ఏప్రిల్ 10.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ ichr.ac.inను సందర్శించండి. 

సెలెక్షన్ ప్రాసెస్

స్జేజ్​–Iలో ఆన్​లైన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు కేటాయిస్తారు. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. 

స్టేజ్–IIలో ప్రెజెంటేషన్- కమ్- ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి 60 మార్కులు కేటాయించారు. 

ఫైనల్ మెరిట్: స్టేజ్–I, స్టేజ్-IIలో సాధించిన మార్కుల సరాసరి ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.