గడ్డపారతో ఏటీఎం చోరీకి యత్నించి పరార్

గడ్డపారతో ఏటీఎం చోరీకి యత్నించి పరార్

ఇద్దరు దుండగులు ఏటీఎం చోరీకి యత్నించి  విఫలమయ్యారు. గడ్డపారతో ఏటీఎంను బద్దలు  కొడుతుండగా స్థానికులు గమనించి కేకలు వేశారు. దీంతో అక్కడి నుంచి ఇద్దరు దొంగలు పరారయ్యారు. ఈ ఘటన మార్చి 14న రాత్రి హైదరాబాద్ లో ని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న గ్రీన్ హిల్స్ కాలనీ ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలో జరిగింది.  స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.