హైదరాబాద్, వెలుగు: దృఢమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో కాస్ట్, మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ (సీఎంఏ) పాత్ర ఎనలేనిదని ఐసీఎంఏఐ అధ్యక్షుడు అశ్విన్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాస్ట్, మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ వ్యాపారాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని, అందుకే వీరికి ప్రాధాన్యం మరింత పెరిగిందని చెప్పారు. ఆర్థిక, పన్ను విధానాలు రూపొందించడంలో వీళ్లు ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారని పేర్కొన్నారు.
