
ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రీసెర్చ్ అసోసియేట్, లాబొరేటరీ టెక్నీషియన్, ఇతర పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
- పోస్టుల సంఖ్య: 21
- పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్ 07, లాబొరేటరీ టెక్నీషియన్ 07, మల్టీ టాస్కింగ్ స్టాఫ్07.
- ఎలిజిబిలిటీ
- రీసెర్చ్ అసోసియేట్: లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ లేదా ఎంఎల్ టీలో మూడేండ్ల గ్రాడ్యుయేషన్‌తోపాటు సంబంధిత సబ్జెక్టులో పని అనుభవం ఉండాలి. లేదా లైఫ్‌సైన్స్ సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- లాబొరేటరీ టెక్నీషియన్: 12వ తరగతిలో సైన్స్ సబ్జెక్టు చదివి ఉండాలి. ఎంఎల్టీ లేదా డీఎంఎల్టీ లేదా ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత ఫీల్డ్‌లో ఐదేండ్లు పని అనుభవం ఉండాలి .
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్: పదో తరగతి లేదా సమాన అర్హతతోపాటు గుర్తింపు పొందిన సంస్థలో ల్యాబ్ వర్క్, ఆఫీస్ వర్క్ నిర్వహణలో ఐదేండ్ల అనుభవం ఉండాలి.
- వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ట్రేడ్లను అనుసరించి జూన్ 25 నుంచి జులై ఏడు వరకు నిర్వహిస్తారు.
- పూర్తి వివరాలకు icmr.gov.in వెబ్సైట్లో చూడగలరు.