ఐసీఎంఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ ఆన్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ICMR NIIRNCD) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 04 (యంగ్ ప్రొఫెషనల్స్– I, యంగ్ ప్రొఫెషనల్స్ –II).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. ఏడాది పని అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జనవరి 23.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు niirncd.icmr.org.in వెబ్సైట్ను సంప్రదించండి.
