
ఐసీఎంఆర్ రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (ఐసీఎంఆర్ ఆర్ఎంఆర్సీఎస్వీపీ) యంగ్ ప్రొఫెషనల్స్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 29న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
పోస్టుల సంఖ్య: 04 (యంగ్ ప్రొఫెషనల్ II (అడ్మినిస్ట్రేషన్) 02, యంగ్ ప్రొఫెషనల్స్ II (ఫైనాన్స్, ఆడిట్ అండ్ అకౌంట్స్) 01, యంగ్ ప్రొఫెషనల్స్ II (సైంటిఫిక్) 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఏఎంఎస్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎం.కాం, ఎంఎస్సీ, ఎంబీఏ/ పీజీడీఎం, ఎంఎస్/ ఎండీ, బీఎస్ఎంఎస్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: సెప్టెంబర్ 29.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.icmr.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.