దొంగ స్కీమ్స్‌ను ఇలా పసిగట్టండి!

దొంగ స్కీమ్స్‌ను ఇలా పసిగట్టండి!
  • ‘తక్కువ రిస్క్‌‌-ఎక్కువ లాభం’ ఎక్కడా ఉండదు
  • ఇతరులను జాయిన్ చేస్తే కమీషన్లా..అయితే జాగ్రత్త
  • లాభాలు ఎలా వస్తాయో చెప్పలేకపోతున్నారా అయితే అది ఫ్రాడ్ స్కీమే!

బిజినెస్డెస్క్, వెలుగు: తక్కువ టైమ్లోనే ఎక్కువ లాభాలను ఇస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నాయి కొన్ని స్కీమ్స్ లేదా కంపెనీలు. తెలుగు రాష్ట్రాలలో ‘అగ్రిగోల్డ్’ ఫ్రాడ్ గురించి తెలిసే ఉంటుంది. లక్షల మంది ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు సేకరించి ఆ డబ్బులతో ఉడాయించారు కొంత మంది. దేశంలో చాలా చోట్ల ఇలాంటి మోసాలు  బయటపడుతున్నాయి. తాజాగా అహ్మదాబాద్లో పొంజి స్కీమ్స్ను నడుపుతున్న కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ ద్వారా ఈ స్కీమ్ను నిందితులు నడిపారు. బెంగళూరులో ఇలాంటి స్కీమ్తోనే ఇన్వెస్టర్లు నష్టపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాండ్ల సర్టిఫికెట్లను జారీ చేసి ప్రజల నుంచి రూ. 80 కోట్లను సేకరించిన ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా,  పొంజి స్కీమ్స్ అంటే ఎక్కువ లాభాలొస్తాయని ఆశ చూపి ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు సేకరించడం. ఈ స్కీమ్లలో తర్వాత జాయిన్ అయిన వారి డబ్బులను ముందు జాయిన్ అయిన వారికి ఇచ్చి ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నామనే ఒక భ్రమను ఇన్వెస్టర్లలో కల్పిస్తారు. ఇలా కొంత అమౌంట్ సేకరించాక ప్రజల డబ్బులతో  మోసగాళ్లు పారిపోతారు.  సాధారణంగా పొంజి స్కీమ్లు ఎక్కువగా లోకల్గా పనిచేస్తుంటాయి. ఇప్పుడిప్పుడు ఆన్లైన్ ద్వారా కూడా ఈ స్కీమ్లను నడుపుతున్నారు. ఒక స్కీమ్ ఫ్రాడ్ స్కీమ్ కాదా? అనేది ఈ కింది అంశాలను బట్టి తెలుసుకోవచ్చు..

ఎలా పనిచేస్తదో అర్థం కాదు..
బిజినెస్ మోడల్ ఏంటో అర్థం కాకపోతే అలాంటి స్కీమ్స్ దూరంగా ఉండడం బెటర్. మోసం చేయాలనుకునే వారు  ఇన్వెస్టర్లను తికమక పెట్టాలని చూస్తారు. తమ బిజినెస్ ఎలా నడుస్తుందో అర్థం కాకుండా చెప్తారు. పొంజి స్కీమ్లను నడిపే కంపెనీలు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ విధానాల గురించి మాట్లాడొచ్చు. ఉదాహరణకు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ లాభాలను ఇస్తామని చెప్పొచ్చు. కంపెనీలు ఎలా పనిచేస్తాయో అర్థం కానప్పుడు వాటిలో ఇన్వెస్ట్ చేయకండి.

కొత్త వాళ్లను జాయిన్ చేస్తే కమీషన్..
స్కీమ్లోకి కొత్త వారిని జాయిన్ చేస్తే కమీషన్లను ఇస్తామంటూ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి మోసగాళ్లు ప్రయత్నిస్తారు. తక్కువ రిస్క్తో ఎక్కువ రిటర్న్స్ ఇస్తామని చెప్పి, కొత్త వారిని జాయిన్ చేస్తే కమీషన్లు ఇచ్చే స్కీమ్ అయితే అది కచ్చితంగా పొంజి స్కీమే. ఇలాంటి ఫ్రాడ్ స్కీమ్లను నడిపే వారు గవర్న్మెంట్ డాక్యుమెంట్లను, కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను కూడా చూపించొచ్చు. ప్రభుత్వ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని నమ్మకూడదు. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి సర్టిఫికేట్ను ఈజీగా పొందొచ్చు. కానీ ప్రభుత్వం దగ్గర పేర్కొన్న బిజినెస్ మోడల్కు, వీరు చేస్తున్న బిజినెస్కు మధ్య సంబంధం ఉండకపోవచ్చు. అందుకే ఇన్వెస్ట్ చేసే ముందు వారి బిజినెస్ మోడల్ ఏంటో పూర్తిగా తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. 
ఏదైనా స్కీమ్ చాలా బాగుందా అయితే కొంత జాగ్రత్తగా ఉండాలి.  రేడియో, టీవీ, పేపర్లలో ప్రకటనగా వచ్చినంత మాత్రానా వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. ఈ స్కీమ్లకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించాలి. 
ప్రభుత్వ రెగ్యులేట్ చేయని ఏ కంపెనీలోనూ లేదా స్కీమ్లలోనూ ఇన్వెస్ట్ చేయకపోవడం బెటర్. 
ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయాలనుకునే ముందు అవి ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవాలి. ట్యాక్స్ ఎలా చెల్లిస్తున్నాయి, రిస్క్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొవాలి. నమ్మదగ్గ యూట్యూబ్ ఛానెల్స్, మీడియా, సొషల్ మీడియా సైట్లలో ఈ ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి రివ్యూలను చూడాలి. అప్పటికే ఇన్వెస్ట్ చేసిన వారి ఎక్స్పీరియెన్స్ను తెలుసుకోవాలి.

ఏడాదికి 12% కంటే ఎక్కువ రిటర్న్స్ కష్టం
తక్కువ రిస్క్తో ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ లాభాలను ఇవ్వలేదు. అది కూడా గ్యారెంటీగా రిటర్న్స్(లాభాలు) అంటే అసాధ్యమే. ఇన్వెస్ట్మెంట్పై రోజుకి 1 శాతం లాభాన్ని ఇస్తామని ఎవరైనా చెబితే వారికి దూరంగా ఉండడం బెటర్. లేదా తక్కువ టైమ్లోనే ఇన్వెస్ట్మెంట్ను డబుల్ చేస్తామని ఏ స్కీమ్ అయిన ఆఫర్ చేస్తే వీలున్నంత వరకు దూరంగా ఉండండి. ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏడాదికి 12 శాతం కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందంటే అది ఫ్రాడ్ స్కీమ్ అవ్వడానికి అవకాశాలెక్కువ. షేర్ మార్కెట్లో పెడితే లాంగ్ టెర్మ్లో గాని 10-12 శాతం రిటర్న్స్ రావని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. షేర్ మార్కెట్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇంకెక్కడా రావు.  గత రెండు మూడు నెలల్లో వచ్చిన  నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను (బాండ్లు) గమనిస్తే గరిష్టంగా 9-10 శాతం రిటర్న్స్ను మాత్రమే ఆఫర్ చేశాయి. ఇవి గ్యారెంటీ రిటర్న్స్. ఇన్వెస్ట్మెంట్ రెండింతలు కావడానికి టైమ్ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడులపై12 శాతం రిటర్న్స్ వస్తే మొత్తం ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవ్వడానికి కనీసం ఆరేళ్ల కన్నా ఎక్కువ టైమ్ పట్టొచ్చని అంటున్నారు. అదే 10 శాతం రిటర్న్స్ వస్తే కనీసం ఏడేళ్లయినా పడుతుందని పేర్కొన్నారు. ఎందులోనైనా ఇన్వెస్ట్ చేసే ముందు వీటిని పరిగణనలోకి తీసుకోవాలని సలహాయిస్తున్నారు.