జీవవైవిధ్యం కలిగిన టాప్ 20 వంటకాల్లో ఇడ్లీ, చికెన్ చాట్

జీవవైవిధ్యం కలిగిన టాప్ 20 వంటకాల్లో ఇడ్లీ, చికెన్ చాట్

అత్యధిక జీవవైవిధ్యం కలిగిన టాప్ 20 వంటకాల్లో భారత దేశపు ఇండ్లీ, చనా మసాలా, రాజ్మా తోపాటు చికెన్ జల్ఫ్రేజీ, చికెన్ చాట్ లు ఉన్నాయని ఇటీవల నిర్వహించిన ఓ సర్వే లో తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ప్రసిద్ధ 151 స్థానిక వంటకాలను విశ్లేషించిన కొత్త అధ్యయనం టాప్ 20 వంటకాల్లో ఈ భారతీయ వంటకాలున్నట్లు తెలిపింది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ శాస్త్రవేత్తలు.. ప్రపంచ వ్యాప్తంగా స్థానిక ఉత్పత్తి చేయబడినపుడు వాటి జీవ వైవిధ్యాన్ని అంచనా వేయడానికి తీసుకున్న ప్రసిద్ద వంటకాల జాబితాలను విశ్లేసించారు. 

అయితే గొడ్డు మాంసం, చిక్కుళ్లు, బియ్యం వంటి పదార్థాలతో తయారు చేయబడిన వంటకాలు ఇప్పటికే భారత దేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశంలో జీవ వైవిధ్య హాట్ స్పాట్ లను ఆక్రమించాయయని పరిశోధకులు కనుగొన్నారు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ , ఇతర విభిన్న పర్యావరణ వ్యవస్థలను పచ్చిక బయళ్లకు మార్చడం వల్ల బ్రెజిలియన్ గొడ్డు మాసం వంటకాలు కూడా అధిక జీవ వైవిధ్య ప్రభావాలను కలిగి ఉన్నాయని పరిశోధకులు చెప్పారు.

మరో వైపు బంగాళదుంప, గోధుమల వంటి పిండి పదార్థాలతో తయారు చేయబడిన వంటలలో మాంటౌ, చైనీస్ స్టీమ్డ్ బన్ వంటి అత్యల్ప జీవవైవిధ్యం కలిగి ఉన్నాయని Plow ONE జర్నల్ లో ప్రచురించిన పరిశోధకులు తమ అధ్యయనంలో తెలిపారు. 

ఈ పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని వంటల జీవ వైవిధ్య ఫూట్ ఫ్రింట్ లను అంచనా వేయడం ద్వారా వినియోగదారులను శక్తివంతం చేయడమే కాకుండా.. జీవ వైవిధ్యంపై ఆహారాన్ని ఉత్పత్తి చేసే ప్రభావాలను తగ్గించడానికి స్థిరమైన ఆహారం వైపు వెళ్లేందుకు సులభతరం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.