
హైదరాబాద్, వెలుగు: విశాక ఇండస్ట్రీస్‌కు చెందిన ఆటమ్ సోలార్ రూఫ్‌లకు ఐఈసీ (ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్) స్టాండర్డ్ అప్రూవల్స్ వచ్చాయి. ఆటమ్ సోలార్ రూఫ్‌లను దుబాయ్‌లో అంకుల్స్ షాప్ లాంచ్ చేసిందని కంపెనీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.
ఐఈసీ స్టాండర్డ్ అనుమతులు పొందడంపై విశాక ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గడ్డం స్పందించారు. గత కొంత కాలం నుంచి ఐఈసీ స్టాండర్డ్ అనుమతులు పొందేందుకు ప్రయత్నాలు చేశామని అన్నారు. ఈ అప్రూవల్సే తమ ప్రొడక్ట్ గురించి, తమ ఆటమ్ టీమ్ గురించి, వారి డెడికేషన్ గురించి చెబుతాయని పేర్కొన్నారు. ఆటమ్ రూఫ్‌లను తీసుకురావడం గర్వంగా అనిపిస్తోందని, ఈ ప్రొడక్ట్ కేవలం వాతావరణానికి మేలు చేయడమే కాకుండా సోలార్ ఇండస్ట్రీలో ఒక కొత్త అధ్యాయాన్ని రాస్తుందని చెప్పారు.
ఆటమ్ సోలార్ రూఫ్‌లు సోలార్ ప్యానెల్స్‌గాను, రూఫ్‌లుగాను పనిచేస్తాయని అన్నారు. ఆటమ్ వంటి ఇండియన్ ప్రొడక్ట్‌కు గ్లోబల్‌గా అంగీకరించే ఐఈసీ అనుమతులు రావడం బట్టి చూస్తే సస్టయినబుల్ ప్లానెట్ కోసం పశ్చిమ దేశాలతో పాటు మనమూ పోటీపడుతున్నట్టు తెలుస్తోందని వంశీ పేర్కొన్నారు.
యూఏఈ, జీసీసీలలో విశాక విస్తరించడంలో సాయపడిన యూఏఈ పార్టనర్ అంకుల్ షాప్స్‌కు ఈ సందర్భంగా ఆయన థ్యాంక్స్ చెప్పారు. సస్టయినబిలిటీ, గ్రీన్ ఎనర్జీలో మరో ముందడుగు వేశామని అంకుల్ షాప్స్ డైరెక్టర్ యాష్ భాటియా అన్నారు. ఆటమ్ సోలార్ రూఫ్‌లు అధికారికంగా ఐఈసీ స్టాండర్డ్ స్థాయిలో ఉన్నాయని ప్రకటించడం ఆనందంగా అనిపిస్తోందని చెప్పారు. కాగా, ఐఈసీ స్టాండర్డ్ అప్రూవల్స్ రావడంతో విశాక ఇండస్ట్రీస్ షేరు శుక్రవారం 9 శాతం పెరిగి రూ. 549 వద్ద ముగిసింది.