ఆప్‌ లేకపోతే గుజరాత్‌లో బీజేపీని ఓడించే వాళ్లం : రాహుల్‌ గాంధీ

ఆప్‌ లేకపోతే గుజరాత్‌లో బీజేపీని ఓడించే వాళ్లం : రాహుల్‌ గాంధీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి ఆమ్ ఆద్మీ పార్టీయే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆప్‌ లేకపోతే బీజేపీని ఓడించి ఉండేవాళ్లమన్నారు. గుజరాత్‌లో బీజేపీతో ఆప్ కుమ్మక్కు అయ్యిందని ఆరోపించిన రాహుల్ .. రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలను దెబ్బతీశాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ చేసిన ఈ ఆరోపణలను ఆప్ తోసిపుచ్చింది.  

ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను 156 స్థానాల్లో బీజేపీ గెలిచి చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్ కేవలం 17 స్థానాల్లో మాత్రం గెలుపొందింది. ఇక ఆప్ 5 సీట్లను మాత్రమే గెలుచుకుంది.