బీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే మహిళలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి: విజయశాంతి

బీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే మహిళలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి: విజయశాంతి

హైదరాబాద్: మహిళా రిజర్వేషన్లపై బీఆర్ఎస్​కు చిత్తశుద్ధి ఉంటే, మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయ శాంతి డిమాండ్ చేశారు. అలా చేస్తే మిగతా పార్టీలపైనా ఒత్తిడి పెరిగి, ప్రధాన పార్టీలన్నీ మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తాయని ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘మోదీ ప్రభుత్వం తెచ్చిన మహిళా బిల్లు.. జనగణన, డీలిమిటేషన్​దృష్ట్యా 2028 లేదా 2029లోనే అమలవుతుంది. 

అలా అని వచ్చే ఎన్నికల్లో మహిళలకు సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకోకుండా.. ఇప్పటి నుంచే అన్ని ఎన్నికల్లోనూ మహిళలకు అన్ని పార్టీలు ఎక్కువ సీట్లు ఇచ్చి పార్టీలు తమ నిజాయితీని నిరూపించుకోవాలి. ఇప్పటికే వందకుపైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్..కేవలం 6 స్థానాలనే మహిళలకు ఇచ్చింది. ఇప్పటికైనా ఆ పార్టీ సమీక్ష చేసుకుని, మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించాలి” అని విజయశాంతి పేర్కొన్నారు.