రాజస్థాన్‌‌లో పవర్ మళ్లీ కాంగ్రెస్ దే : మల్లికార్జున ఖర్గే

రాజస్థాన్‌‌లో పవర్  మళ్లీ కాంగ్రెస్ దే : మల్లికార్జున ఖర్గే

జైపూర్: ప్రధాని మోదీ ఎంత ప్రయత్నించినా రాజస్థాన్‌‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. శనివారం భరత్‌‌పూర్ జిల్లా వీర్‌‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ తన ఫ్రెండ్స్ ప్రయోజనాల కోసమే పనిచేస్తుందన్నారు. ‘‘పేదల కోసం ఏదైనా చేస్తే ఉచితాలు అంటూ మోదీ గగ్గోలు పెడతారు. 

కానీ ఆయన మాత్రం సంపన్నులకు రూ.15 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు”అని అన్నారు. దళిత ఇంజనీరుపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే గిరిరాజ్ మలింగను కాంగ్రెస్ పక్కన పెడితే.. బీజేపీ ఆయన్ను పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్నారు. దళిత సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని చెప్పే మోదీ దీనిపై సమాధానం చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు.