పాన్‌‌-ఆధార్ లింక్‌‌ కాకపోతే రూ. వెయ్యి ఫైన్‌‌

పాన్‌‌-ఆధార్ లింక్‌‌ కాకపోతే రూ. వెయ్యి ఫైన్‌‌
  • ఈ నెల 31 చివరి తేది

న్యూఢిల్లీ: ఈ నెల 31 లోపు పాన్‌‌కార్డు, ఆధార్ కార్డులను లింక్ చేయకపోతే లేట్ ఫీజుకు కింద రూ. 1,000 వరకు కట్టాల్సి ఉంటుంది. ఫైనాన్స్‌‌ బిల్లులో సవరణలు చేయడం ద్వారా ఈ రూల్‌‌ను తీసుకొచ్చారు. మార్చి 31 లోపు పాన్‌‌–ఆధార్‌‌‌‌ల లింక్ జరగకపోతే, పాన్‌‌కార్డు పనిచేయదు. గతంలో చాలా సార్లు ఈ డెడ్‌‌లైన్‌‌ను ప్రభుత్వం పొడిగించింది. ఈ సారి ఆధార్‌‌‌‌–పాన్‌‌లను లింక్ చేయని వారిపై పెనాల్టీ విధించాలని చూస్తోందని ఎనలిస్టులు పేర్కొన్నారు. కాగా, సెక్షన్‌‌ 139ఏఏ కింద ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌ రిటర్న్‌‌లను ఫైల్ చేసేటప్పుడు, పాన్‌‌కు అప్లయ్ చేసుకునేటప్పుడు ఆధార్‌‌‌‌ డిటైల్స్‌‌‌‌ను ఇవ్వడం తప్పనిసరి.