
ఢిల్లీలో చాలా మంది పురుషులు మోదీ జపం చేస్తున్నారని సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. అలాంటి వారికి అన్నం పెట్టొద్దని మహిళా ఓటర్లను కోరారు. 2024-25 బడ్జెట్‌లో మహిళలకు కొత్త స్కీంను ప్రవేశపెట్టామని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన మహిళా సమ్మన్ సమరోహ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతి యువతికి, మహిళకు నెలకు రూ. 1000 చొప్పున ఇస్తున్నామని చెప్పారు.
ఉచిత కరెంట్ ఇస్తున్నామని బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని వీటితో పాటు ఇప్పుడు నెలకు రూ. 1000 ఇవ్వబోతున్నామని అన్నారు. ఢిల్లీలో చాలా మంది పురుషులు మోదీ జపం చేస్తున్నారని అవసరమైతే మీ భర్తలకు రాత్రి వేళ డిన్నర్ క్యాన్సిల్ చేయండని సూచించారు. ఢిల్లీ ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.