
కోల్ బెల్ట్: కొత్త బొగ్గు గనులతోనే సింగరేణిలో ఉద్యోగాలు వస్తాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వ హించే బొగ్గు గనుల వేలం పాటలో సింగరేణి పాల్గొని టెండర్లు వేయాలన్నారు. లేదంటే సింగరేణి సంస్థ మనుగడకే ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో అన్ని పార్టీల నాయకులు రాజకీయాలు పక్కన పెట్టి పోరాటం చేయాలన్నారు.
ఇవాళ (మే 26) మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీలు, భీమారం మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త గనుల కోసం టెండర్ ప్రక్రియలో సింగరేణి పాల్గొనాలని ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసిన్నట్లుగా చెప్పారు. కొత్త బొగ్గు గనులు రావాలని.. ఇక్కడి యువతకు ఉద్యోగాలు దక్కలాంటే టెండర్లో పాల్గొనే విషయంపై అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి. ఇందు కోసం అన్ని పార్టీలు ఐక్యంగా పని చేయాలన్న రు.
'నేరుగా గనులు అలాట్మెంట్ చేసుకుంటే 14శాతం ఎక్కువ రాయల్టీ కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇది సింగరేణికి మేలు కాదు. ఏటా 20 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కెపాసిటీ గల ఒడిశాలోని చైనీ బొగ్గు బ్లాక్ దక్కించుకున్నాం. ఉపాధి అవకాశాలు కూడా అక్కడే దొరుకు తాయ్. సింగరేణిలో ఉద్యోగాలు రావాలంటే టెండర్ ప్రక్రియలో పాల్గొని కొత్త బొగ్గుగనులు దక్కించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరు తున్న. చెన్నూరు నియోజకవర్గంలో అకాల వర్షాలతో పంట నష్టంపై నిన్ననే మంచిర్యాల జిల్లాకలెక్టర్ కుమారదీపక్ తో చర్చించా.. నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పిస్తా.
చెన్నూరు నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో వందకోట్ల ఫండ్ తో అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. మొదటి ఫేజ్ లో 3వేల ఇండ్లు మంజూరయ్యాయి, ఇండ్ల నిర్మాణపనులు సాగుతున్నాయి. వచ్చే ఏడాది మరో 3 వేల ఇండ్లు మంజూరు చేయించుకుందాం. జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం స్కీం అమల్లోకి వస్తుంది. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవా లి' అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.