
నిత్యావసర వస్తువులు, కూరగాయలను అధిక ధరలకు అమ్మేవారిపై కేసులు నమోదు చేస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ.రెడ్డి హెచ్చరించారు. కొత్తగూడెంలోని కలెక్టరేట్లో పౌరసరఫరాలు, వాణిజ్య పన్నులు, కార్మిక, పోలీస్‌శాఖల ఆఫీసర్లతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అధిక ధరలకు అమ్మకాలు సాగించే వారిపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధిక ధరలపై 08744241950 నెంబర్‌కు ఫోన్ చేసి ఆఫీసర్ల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నల్గొండలో నిత్యావసరాలు, ఇతర సామగ్రి ఎవరైనా అధిక ధరలకు అమ్మితే 08682 – 22423 లేదా 9440795618, 7901153248 నంబర్లకు వాట్సాప్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ రంగనాథ్తెలిపారు. డయల్ 100 లేదా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ ద్వారా ప్రజలు అధిక ధరల విక్రయాల సమాచారం ఇవ్వొచ్చన్నారు.