మాది జాతీయవాదం.. వాళ్లది కుల రాజకీయం

మాది జాతీయవాదం.. వాళ్లది కుల రాజకీయం
  • ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. ఏడు దశల ఓటింగ్ లో నిన్న 58 నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్ పూర్తి కాగా.. రెండో దశ పోలింగ్ జరగబోయే చోట్ల ప్రచారంలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ షాజహాన్ పూర్ లో ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. సమాజ్ వాదీ, బహుజన సమాజ్, కాంగ్రెస్ పార్టీలు కుటుంబ పార్టీలని అన్నారు. ఈ పార్టీల నేతలు వాళ్ల కుటుంబాల కోసమే పని చేస్తారని, వాళ్ల వారసులను మాత్రమే పైకి తీసుకొస్తారని యోగి అన్నారు. తాము జాతీయవాదం గురించి మాట్లాడితే, ఆ పార్టీలు కుల రాజకీయాల గురించి మాట్లాడుతున్నాయని చెప్పారు. ‘‘మేం అభివృద్ధి గురించి మాట్లాడితే.. వాళ్లు (ప్రతిపక్షాలు) మతం, సమాధుల గురించి మాట్లాడుతున్నారు. మేం చెరుకు (గన్నా) గురించి మాట్లాడితే వాళ్లు జిన్నా గురించి మాట్లాడుతున్నారు’’ అని యోగి అన్నారు. 

యువతకు స్మార్ట్ ఫోన్లు పంచుతుంటే అడ్డుకున్నరు

ఇవాళ తమ ప్రభుత్వం కోటి మంది యువతకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబెట్స్ ను పంచుతుంటే సమాజ్ వాదీ పార్టీ అడ్డుకుందని సీఎం యోగి అన్నారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి.. స్మార్ట్ ఫోన్ల పంపిణీని నిలిపేయించిందన్నారు. అయితే యువత ఎవరూ బాధపడొద్దని, మళ్లీ తామే అధికారంలోకి వస్తే 2 కోట్ల మందికి స్టార్ట్ ఫోన్లు అందజేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

పోరాటాలు లేకుండానే.. సీఎం పనులు చేస్తారని ఆశిస్తున్నా

గల్ఫ్ జైళ్లలో ఉన్న భారతీయుల వివరాలు వెల్లడించిన కేంద్రం

మాల్యాకు సుప్రీం కోర్టు డెడ్ లైన్