పోరాటాలు లేకుండానే.. సీఎం పనులు చేస్తారని ఆశిస్తున్నా

పోరాటాలు లేకుండానే.. సీఎం పనులు చేస్తారని ఆశిస్తున్నా

జనగామ కలెక్టరేట్ సముదాయం చాలా అద్భుతంగా నిర్మించారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా ఇంత బాగా లేవన్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా సీఎం కేసీఆర్ కు థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు. జనగామ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడారు. పోరాటాలకు మారుపేరుగా ఉన్న ప్రాంతమిది అని, చేర్యాలలో రెవెన్యూ డివిజన్ కావాలని అక్కడి ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ కు అన్నీ తెలుసని, ఆయన చేస్తారన్న నమ్మకం ఉందని అన్నారు. ప్రజల కోరిక మేరకు ఎన్నో రెవెన్యూ డివిజన్లు ఇచ్చారని, ఇప్పుడు కొట్లాడే అవసరం లేకుండానే చేస్తారని అనుకుంటున్నానని ఎంపీ కోమటిరెడ్డి చెప్పారు. అలాగే జనగామకు మెడికల్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ ఇస్తారని నమ్మకం ఉందన్నారు. జనగామను అభివృద్ధి చేస్తానని సీఎం గతంలో చెప్పారని, చెప్పినట్లే చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. మెడికల్ కాలేజీ కోసం ఉద్యమం చేస్తానని కొంత మంది అంటే తానే ఆపానని, తెలంగాణ వచ్చాక మనలో మనకు కొట్లాట ఎందుకు అని అన్నారు. సీఎంతో మాట్లాడి చేపిస్తానని చెప్పానన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఢిల్లీతో యుద్ధం ప్రకటిస్తానన్న కేసీఆర్ ఎక్కడ?

గల్ఫ్ జైళ్లలో ఉన్న భారతీయుల వివరాలు వెల్లడించిన కేంద్రం

మాల్యాకు సుప్రీం కోర్టు డెడ్ లైన్