ఢిల్లీతో యుద్ధం ప్రకటిస్తానన్న కేసీఆర్ ఎక్కడ?

ఢిల్లీతో యుద్ధం ప్రకటిస్తానన్న కేసీఆర్ ఎక్కడ?

తెలంగాణ ప్రజలపై ప్రధాని మోడీ విషం చిమ్మారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చూసి చలించిన సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. తెలంగాణ ఇవ్వడమే కాకుండా.. విభజన చట్టం కింద.. గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఐటీఐఆర్ కారిడార్ ఏర్పాటుకు సోనియా నిర్ణయం తీసుకున్నారన్నారు. కానీ మొన్న దిగజారి మోడీ వ్యవహరించారన్నారు. మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. లేకుంటే ఈ గడ్డపై అడుగుపెట్టవదన్నారు. లోక్ సభలో తెలంగాణ సమాజాన్ని కించపరిచేలా మోడీ మాట్లాడుతుంటే.. టీఆర్ఎస్ ఎంపీలు పల్లెత్తు మాట అనలేదన్నారు. బీజేపీ,టీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం ఉందన్నారు. తెలంగాణ కోసమే పుట్టినట్లు చెప్పుకునే కేసీఆర్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. ఢిల్లీతో యుద్ధం ప్రకటిస్తా.. కొట్లాడుతా అన్న కేసీఆర్ ఏం చేస్తున్నాడన్నారు. మోడీ అంతగా దాడి చేసిన కేసీఆర్ సైలెంట్ గా ఉన్నాడన్నారు. కేసీఆర్ కు చీము నెత్తురు లేదా..  మోడీ మాటలను తిప్పికొట్టాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు.  కేసీఆర్ మధ్యయుగాల్లోని చక్రవర్తుల్లా మారిండన్నారు.జనగామ పట్టణంలో కేసీఆర్ వస్తుండని కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్టులు చేశారన్నారు.  పోలీసులు  ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్నారు.